: ఏడాదిలోగా ప్రకాశం బ్యారేజీకి గోదావరి జలాలు: మంత్రి దేవినేని


గోదావరి జలాలను ఏడాదిలోగా ప్రకాశం బ్యారేజీకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ తెలిపారు. శనివారం విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ మేరకు వెల్లడించారు. గోదావరి నుంచి 80 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలించే అవకాశాలున్నాయని చెప్పిన ఆయన, జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలించే క్రమంలో రైతులను మాత్రం ఇబ్బందులకు గురి చేయబోమన్నారు. ఎక్కడికక్కడ ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసి, రైతులకు సాగులో ఆటంకం కలగకుండానే గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలిస్తామని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News