: భూ సమీకరణ రెవెన్యూ దస్త్రాలను సవరణ చేయిస్తున్నాం: మంత్రి ప్రత్తిపాటి
రాజధాని భూ సమీకరణ గ్రామాల రెవెన్యూ దస్త్రాల సవరణ ప్రక్రియ ఇప్పటికే మొదలయిందని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. లోపాలు లేకుండా సవరణ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని గుంటూరులో తెలిపారు. మొత్తం 29 గ్రామాలకు పది బృందాలతో సవరణ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. వారం రోజుల నుంచి దస్త్రాల సవరణ కొనసాగుతోందని, పది రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు.