: డిసెంబర్ 3న హ్యూస్ అంత్యక్రియలు
తలకు బౌన్సర్ తగిలి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ అంత్యక్రియలు డిసెంబర్ 3న నిర్వహించనున్నారు. స్వస్థలం మాక్స్ విల్లేలో హ్యూస్ ను ఖననం చేస్తారు. మాక్స్ విల్లే... సిడ్నీ, బ్రిస్బేన్ నగరాలకు మధ్యలో ఉంటుంది. హ్యూస్ అంత్యక్రియలకు క్రికెటర్లు హాజరవుతారని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) పేర్కొంది. దీంతో, భారత్ తో జరగాల్సిన తొలి టెస్టును వాయిదా వేసినట్టు తెలిపింది.