: ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీకి చంద్రబాబు అనుమతి


ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతి తెలిపారు. డిసెంబర్ చివరిలోగా అన్ని పదవులను భర్తీ చేయాలని ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 20వేలకు పైగా నామినేటెడ్ పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో టీటీడీ బోర్డు, దేవాలయ కమిటీలు, మార్కెట్ యార్డులు, కార్పొరేషన్లలో ఉన్న ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. అతి ముఖ్యమైన తిరుమల తిరుపతి దేవస్ధానం బోర్డుకు సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తవగా, చంద్రబాబు రాష్ట్రానికి చేరుకున్న తరువాత ఆమోదం తెలుపనున్నారు. అటు పార్టీలో గత పదేళ్లలో కష్టపడ్డవారికే పదవులు ఇవ్వాలని టీడీపీ ప్రోగ్రామ్స్ కమిటీ ఓ జాబితా సిద్ధం చేసింది. రాష్ట్ర విభజన తరువాత తొలిసారి చేపడుతున్న భర్తీలో ఎవరికి పదవుల దక్కుతాయా అని టీడీపీ నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

  • Loading...

More Telugu News