: లక్ష్మీపార్వతి వల్ల ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుంది: నన్నపనేని
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ మరణంపై విచారణ జరపాలని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లక్ష్మీపార్వతి లేఖ రాయడంపై శాసనమండలిలో టీడీపీ చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి మండిపడ్డారు. ఎన్టీఆర్ గుండె చాలా గట్టిదని... గతంలో తాము తిరుగుబాటు చేసినప్పుడు ఆయనకు ఏమీ కాలేదని... ఆ తర్వాతే ఆయన జీవితం ముగిసిందని చెప్పారు. లక్ష్మీపార్వతి ఆయన జీవితంలో ప్రవేశించిన తర్వాత జరిగిన ఘటనలన్నింటిపై విచారణ జరిపించాలని నన్నపనేని అన్నారు. ఎన్టీఆర్ కు ఇచ్చిన మందులు, ఆహారం మొదలు, కుటుంబ సభ్యులను దగ్గరకు రానివ్వకపోవడం దాకా విచారణ జరగాలని ఆమె తెలిపారు. లక్ష్మీపార్వతి రాసిన లేఖ ఎన్టీఆర్ గౌరవాన్ని తగ్గించేలా ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ ఆత్మ క్షోభించేలా లక్ష్మీపార్వతి వ్యవహారశైలి ఉందని మండిపడ్డారు.