: పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు... 35 మంది అయ్యప్ప భక్తులకు గాయాలు
అదుపు తప్పిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులోని 35 మంది అయ్యప్ప స్వామి భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం పురుషోత్తపురం వద్ద జరిగింది. వీరంతా శబరిమలై నుంచి విశాఖ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, ఎవరికీ తీవ్ర గాయాలు కాకపోవడంతో అయ్యప్ప భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.