: పవన్ కల్యాణ్ కు విగ్రహం


తాము అమితంగా అభిమానించే వ్యక్తులకు విగ్రహాలు ఏర్పాటు చేయడం, గుళ్లు కట్టి పూజలు చేయడంలాంటివి తమిళనాడులో సర్వసాధారణమే. అయితే, తాజాగా ఇదే తరహా విపరీతాభిమానం ఏపీకి కూడా పాకింది. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆయన అభిమానులైన తాడేపల్లిగూడెంకు చెందిన డాక్టర్ అరుణ ప్రసాద్, కరుణాకర్ లు ఈ విగ్రహాన్ని రూ. 2 లక్షలు ఖర్చు చేసి తయారు చేయించారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు పవన్ ను ఆహ్వానించాలని వారు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News