: రాజీ బాట పట్టిన పురచ్చితలైవి... కోర్టు బయటే సెటిల్ మెంట్


గతంలో చేసిన తప్పులు జయకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవలి కోర్టు తీర్పుతో రాజకీయ జీవితానికి దూరమైన జయ... మొండిగా ముందుకు వెళ్లడం కంటే, రాజీ బాట పట్టడమే మేలని నిర్ణయించుకున్నారు. రెండు దశాబ్దాల క్రితం వరుసగా రెండేళ్లు (1991-92, 1992-93) జయ, ఆమె సన్నిహితురాలు శశికళకు చెందిన జయ పబ్లికేషన్, శశి ఎంటర్ ప్రైజెస్ ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయలేదు. వీరిద్దరూ ఆదాయ పన్ను ఎగవేతకు పాల్పడ్డారంటూ ఐటీ శాఖ క్రిమినల్ కేసులు దాఖలు చేసింది. దీనికి సంబంధించి తమ ముందు హాజరు కావాలంటూ కోర్టు ఎన్నిసార్లు ఆదేశించినా, వాయిదాలు కోరుతూ కోర్టుకు హాజరుకాకుండా వచ్చారు. ఈ క్రమంలో కోర్టు బయటే పన్ను చెల్లింపులకు సంబంధించి సెటిల్ మెంట్ చేసుకోవాలని జయకు సుప్రీంకోర్టు కూడా సూచించింది. టైం బాగోలేదనుకున్నారో ఏమో కాని... సుప్రీం సూచనల మేరకు నడుచుకుందామనుకున్నారు జయ. ఐటీ శాఖతో రాజీ కుదుర్చుకున్నారు. ఒప్పందం మేరకు బకాయి మొత్తాన్ని నిన్ననే (శుక్రవారం) జయ చెల్లించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News