: తొలి టెస్టు జరగాలని కోరుకుంటున్న హ్యూస్ కుటుంబం
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ నిర్వహణ అనుమానంగా మారిన నేపథ్యంలో, ఫిలిప్ హ్యూస్ కుటుంబం స్పందించింది. హ్యూస్ కుటుంబం తరపున దక్షిణ ఆస్ట్రేలియా క్రికెట్ సంఘం సీఈఓ కీత్ బ్రాడ్ షా మాట్లాడారు. తొలి టెస్టు జరగాలని హ్యూస్ కుటుంబం కోరుకుంటోందని తెలిపారు. మొదటి టెస్టు బ్రిస్బేన్ లో డిసెంబర్ 4 నుంచి జరగాల్సి ఉంది. కాగా, దక్షిణ ఆస్ట్రేలియాలో తాము నిర్వహించిన ఎన్నో కోచింగ్ క్యాంపుల్లో హ్యూస్ చిన్నారులకు శిక్షణ ఇచ్చాడని బ్రాడ్ షా గుర్తు చేసుకున్నారు. పిల్లలు అతడిని ఎంతో ప్రేమించేవారని చెప్పారు. ఆ చిన్నారుల హృదయాల్లో హ్యూస్ చిరస్థాయిగా నిలిచిపోతాడని పేర్కొన్నారు.