: తమిళనాట దారుణం... పాఠశాలలో విద్యార్థి హత్య


కుటుంబ కలహాలు విద్యార్థుల్లో విషబీజాలు నాటుతున్నాయి. దీంతో, విద్యార్థి దశలోనే బాలలు నేరస్తులుగా మారుతున్నారు. నిన్న హైదరాబాదులో సోదరుడి వరసైన బాలుడ్ని గొంతు నులిమి హత్య చేసి చెరువులో పడేసిన ఘటన మరువకముందే, తమిళనాడులోని విరుదునగర్ జిల్లా పంధల్ కుడి గ్రామంలో స్కూల్ లోనే సహ విద్యార్థిని హత్య చేసిన సంఘటన కలకలం రేపుతోంది. పంధల్ కుడి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న భాస్కర్ (13)పై అదే గ్రామానికి చెందిన మరో బాలుడు పదునైన ఆయుధంతో దాడిచేసి పారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన విద్యార్థిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండాపోయింది. అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో స్కూలు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలోని రెండు కుటుంబాల మధ్య తగాదాలు ఉన్నాయని, విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. కాగా, బాలుడు మృతి చెందడంతో పాఠశాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు.

  • Loading...

More Telugu News