: కిరోసిన్ తో కల్తీ డీజిల్ తయారీ ముఠా అరెస్టు
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్లలో కల్తీ డీజిల్ తయారీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కిరోసిన్ తో కల్తీ డీజిల్ తయారు చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందులో రెండు ట్యాంకర్ల కల్తీ డీజిల్ ను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ డీజిల్ వ్యవహారంలో దుళ్ల కిరోసిన్ డీలర్ తమ్మన హరిబాబును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కల్తీ డీజిల్ ను పాలకొల్లు, రాజమండ్రి, భీమవరంలోని పెట్రోల్ బంక్ లకు సరఫరా చేస్తున్నట్టు విజిలెన్స్ అధికారులు తెలిపారు.