: మకావ్ ఓపెన్ లో సెమీస్ కు దూసుకెళ్లిన పీవీ సింధు
డిఫెండింగ్ ఛాంపియన్ పీవీ సింధు మకావ్ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టోర్నీలో తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఈ రోజు జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ లో విజయం సాధించి సెమీ ఫైనల్స్ లో చోటు సంపాదించుకుంది. పదకొండవ ర్యాంకు క్రీడాకారిణి అయిన సింధు ఐదవ సీడెడ్ చైనా క్రీడాకారిణి హన్ లిపై 21-17, 19-21, 21-16 తో గెలిచింది.