: ఎన్టీఆర్ మరణంపై సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయించండి: కేసీఆర్ కు లక్ష్మీపార్వతి లేఖ
వైకాపా నేత లక్ష్మీపార్వతి శుక్రవారం తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఓ లేఖ రాశారు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, తన భర్త దివంగత నందమూరి తారక రామారావు మరణంపై సిట్టింగ్ జడ్జీ చేత విచారణ చేయించాలని ఆమె ఆ లేఖలో కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ శిష్యుడిగా తన అభ్యర్థనను మన్నించాలని కూడా ఆమె ఆ లేఖలో కేసీఆర్ ను కోరారు. కుట్ర, మోసంతో వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, ఎన్టీఆర్ మరణానికి కారకుడిగా నిలిచారని ఈ సందర్భంగా ఆమె ఆరోపించారు. అయితే వాస్తవాలను కప్పిపుచ్చి, ఓ వర్గం మీడియాను తన గుప్పిట్లో పెట్టుకుని చంద్రబాబు నేరాన్ని తనపై నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక శంషాబాద్ ఎయిర్ పోర్టులోని డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని ఆమె కేసీఆర్ ను కోరారు.