: అమెరికాలో భారతీయుల పెట్టుబడులు ఎందుకు పెరుగుతున్నాయంటే...!


అమెరికాలో స్థిరాస్తులు కొంటున్న భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2014 మార్చితో ముగిసిన ఏడాది కాలంలో 5.8 బిలియన్ డాలర్ల మేర విలువ చేసే స్థిరాస్తులను భారతీయులు కొనుగోలు చేశారని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ జోన్స్ లాంగ్ లాషెల్లే (జేఎల్ఎల్) వెల్లడించింది. 2013తో పోలిస్తే ఈ తరహా పెట్టుబడుల్లో 6 శాతం వృద్ధి నమోదైంది. అంతేకాదండోయ్, మన భారతీయులు రోజూ రూ.2.81 కోట్ల మేర పెట్టుబడులను ఆ దేశ స్థిరాస్తి రంగంలో పెడుతున్నారట. ఇక మనవాళ్లు నివాస స్థలాలు కొంటున్న అమెరికా నగరాల్లో లాస్ ఏంజెలిస్, లాస్ వెగాస్, షికాగో, డల్లాస్, న్యూయార్క్ నగరాలు ప్రాధాన్య క్రమంలో ఉన్నాయి. ఇక అక్కడ పెట్టుబడులు పెట్టడానికి గల కారణాల విషయానికొస్తే... వ్యాపారం, ఉద్యోగం నిమిత్తం అమెరికాకు వెళుతున్న భారతీయుల్లో అక్కడే స్థిరపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అంతేకాక ద్వైపాక్షిక సంబంధాల విషయంలో భారత్ తో ఆ దేశం వ్యవహరిస్తున్న తీరులో వచ్చిన దీర్ఘకాలిక దృక్పథం కూడా మనోళ్లను బాగానే ఆకట్టుకుంటోంది. ఇక విదేశాల్లో స్థిరాస్తులు కొనుగోలు చేసే పరిమితిని 75 వేల డాలర్ల నుంచి 1.25 లక్షల డాలర్లకు పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం కూడా ఈ తరహా పెట్టుబడులకు సరికొత్త జవసత్వాలనిచ్చిందని జేఎల్ఎల్ అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News