: మళ్లీ నటన వైపు శ్వేతాబసు ప్రసాద్


బంజారాహిల్స్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడి, కోర్టు ఆదేశాలతో రెస్క్యూ హోమ్‌ లో ఇంత కాలం ఉన్న సినీ నటి శ్వేతాబసు ప్రసాద్ మరోసారి మేకప్ వేసుకోనుంది. జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు హన్సల్ మెహతా రూపొందిస్తున్న డాక్యుమెంటరీలో శ్వేత కీలక పాత్రను పోషించనుంది. అతి త్వరలో ఈ డాక్యుమెంటరీ షూటింగ్ ప్రారంభం కానున్నదని సమాచారం. చిన్నతనంలోనే నటిగా జాతీయ అవార్డును పొందిన శ్వేతాబసు ప్రసాద్, తాను ఎలాంటి తప్పు చేయలేదని ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News