: మట్టి కుండలతో ఈరోజు తృణమూల్ ఎంపీల నిరసన
పార్లమెంటు వెలుపల ప్రాంగణంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఈ రోజు మట్టి కుండలు చేత పట్టుకుని, మెడలో ప్లకార్డును వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. 'మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం'లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం మార్పులు తీసుకురాబోతుందన్న ఊహాగానాల నేపథ్యంలో ఆ పార్టీ అలా వినూత్నరీతిలో తమ నిరసన తెలిపింది. చట్టంలో మార్పులు తీసుకురాబోయే ముందుగా, ప్రభుత్వం ఈ వంద రోజుల పథకం కింద పనిచేస్తున్న గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు ఇచ్చే వేతనాలు పెంచాలని తృణమూల్ ఎంపీలు డిమాండ్ చేశారు.