: క్షేమంగా ఉన్నానంటూ ఫుట్ బాల్ లెజెండ్ పీలే ట్వీట్


అనారోగ్యంతో కొన్ని రోజుల నుంచి ఫుట్ బాల్ లెజెండ్ పీలే బ్రెజిల్ సావోపాలోలోని ఆల్ బర్ట్ ఐన్ స్టీన్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే, తాను క్షేమంగానే ఉన్నానంటూ స్వయంగా పీలేనే ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి తెలిపారు. ఈ మేరకు "ఈ రోజు నేను ఇంటెన్సివ్ కేర్ లో లేను. ప్రైవసీ కోసం ఆసుపత్రిలోని ప్రత్యేక రూమ్ లో ఉంచారు. నన్ను చూసేందుకు వస్తున్న వారందరికీ నా కృతజ్ఞతలు. మీ ప్రేమ, మద్దతు పొందినందుకు నేను కృతజ్ఞుడిని. ఆందోళన పడాల్సిన అవసరమేమీలేదు. నేను ప్రశాంతంగా ఉండేందుకు నా ట్రీట్ మెంట్ ను కొనసాగించాల్సిన అవసరం ఉంది. తరువాత పూర్తి ఆరోగ్యంతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తాను. ఇప్పటికే కుటుంబ సభ్యులతో కలసి యాత్రలు చేయాలని ఓ ప్లాన్ చేసుకున్నా. థాంక్యు!" అని పీలే వెల్లడించారు.

  • Loading...

More Telugu News