: రిటైర్మెంటుకు ముందు సీఆర్పీఎఫ్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు


ఈ నెలాఖర్లో పదవీ విరమణ చేయనున్న సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ దిలీప్ త్రివేది సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రాష్ట్రాలు మావోయిజం కొనసాగాలని కోరుకుంటున్నాయని ఆరోపించారు. నక్సల్ హింస కొనసాగేందుకు అవకాశం కల్పిస్తున్నాయని, తద్వారా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తాయని ఆ రాష్ట్రాలు భావిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. పేలుడు పదార్థాల అమ్మకాల నియంత్రణను కేంద్రం సీరియస్ గా తీసుకోవడం లేదని, దీంతో, అవి మావోయిస్టులకు సులభంగా అందుతున్నాయని వెల్లడించారు. ఈ కారణంగా భద్రతా బలగాల సిబ్బంది అత్యధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని త్రివేది వివరించారు.

  • Loading...

More Telugu News