: టోక్యోలోనే అనుమతులిస్తాం... ఆ తరువాతే ఆంధ్రకు రండి!: జపాన్ కు బాబు బంపర్ ఆఫర్
జపాన్ పర్యటనలో భాగంగా అక్కడి పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి కావలసిన అనుమతులను టోక్యోలోనే అందిస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఇందుకోసం టోక్యోలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. అనుమతులు తీసుకోవడానికి ఆంధ్రకు రానవసరంలేదని, అన్ని లైసెన్సులనూ ఇక్కడే మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.