: కోల్ కతాలో అమిత్ షా ర్యాలీకి అనుమతి నిరాకరణ


కేంద్రంలో అధికారం చెలాయిస్తోన్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిర్వహించతలపెట్టిన ర్యాలీకి కోల్ కతా మునిసిపల్ కార్పొరేషన్ అనుమతి నిరాకరించింది. ఆదివారం చేపట్టనున్న ఈ ర్యాలీకి అనుమతించాలని పార్టీ చేసుకున్న దరఖాస్తును కార్పొరేషన్ గురువారం తిరస్కరించింది. దీంతో కోర్టు మెట్లెక్కేందుకు అమిత్ షా నిర్ణయించుకున్నారు. ర్యాలీపై తమ ఇంజినీర్లు వ్యక్తం చేసిన ఆందోళనలతోనే అనుమతి నిరాకరిస్తున్నట్లు కమిషనర్ ఖలీల్ అహ్మద్ బీజేపీకి సమాచారమందించారు. కమిషనర్ నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర శాఖ భగ్గుమంది. తమ ప్రభంజనానికి జడిసిన తృణమూల్ సర్కారు కమిషనర్ చేత అనుమతి నిరాకరింపజేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాహుల్ సిన్హా ఆరోపించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశాల మేరకే కమిషనర్ అనుమతి నిరాకరించారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై కోల్ కతా హైకోర్టును ఆశ్రయించనున్నామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News