: లాలూ కూతురుతో ములాయం మనవడి పెళ్లి... సమాజ్ దళ్ ఆవిర్భావానికి నాందీ!


బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ లు ఒకే సామాజిక వర్గానికి చెందినా, నిన్నిటిదాకా వైరి వర్గాలుగానే కొనసాగారు. దేశ రాజకీయాల్లో సిగపట్లు పట్టుకున్న వీరిద్దరూ ఒకరి వృద్ధికి మరొకరు నిరోధకులుగా శక్తివంచన లేకుండా పనిచేశారు. అయితే సుదీర్ఘకాలం రాజకీయ శత్రువులుగా కొనసాగిన వీరి మధ్య మైత్రి చిగురించింది. తమ రెండు పార్టీలు రాష్ట్రీయ జనతా దళ్, సమాజ్ వాదీ పార్టీలను కలిపేసి ‘సమాజ్ దళ్’ పేరిట కొత్త పార్టీ ఆవిష్కరణకు ఇద్దరు నేతలూ దాదాపుగా అంగీకారానికి వచ్చారు. అయినా ఇంత అకస్మాత్తుగా వీరి మధ్య పొత్తు కుదరడానికి వారి పిల్లల మధ్య కుదిరిన పెళ్లి దోహదపడింది. లాలూ చిన్న కూతురు రాజలక్ష్మి మెడలో ములాయం మనవడు తేజ్ ప్రతాప్ త్వరలో తాళి కట్టనున్నాడు. డిసెంబర్ లో ఎంగేజ్ మెంట్ చేసుకోనున్న వీరి పెళ్లిని ఫిబ్రవరిలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రెండు కుటుంబాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తన తాత ములాయం సొంత నియోజకవర్గం మెయిన్ పురి నుంచి బరిలోకి దిగిన తేజ్ ప్రతాప్ పార్లమెంటులో తొలిసారిగా అడుగుపెట్టారు.

  • Loading...

More Telugu News