: తమ్ముడిని కిడ్నాప్ చేసి హతమార్చిన అన్న


మొన్నటినుంచి కనిపించకుండా పోయిన ఉదయ్ కిరణ్ వనస్థలిపురం చింతలకుంట చెరువులో శవమై తేలాడు. ఉదయ్ పెదనాన్న కొడుకు నవీన్ ఈ ఘటనలో నిందితుడని పోలీసులు తేల్చారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం బాటసింగారంలోని రాజశ్రీ విద్యామందిర్ లో 7వ తరగతి చదువుతున్న ఉదయ్ ని తన స్నేహితుల సహకారంతో కిడ్నాప్ చేసి, గొంతునులిమి హత్య చేసినట్టు నవీన్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. హత్యకు కుటుంబ తగదాలే కారణమని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News