: ఏపీలో పోర్టుల అభివృద్ధికి సహకరిస్తాం: చంద్రబాబుతో హిటాచి జీఎం అకిరా


ఆంధ్రప్రదేశ్ లోని పోర్టుల అభివృద్ధికి తాము సహకరిస్తామని హిటాచి గ్రూప్ జీఎం అకిరా షిముజు ఏపీ సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చారు. తాము పెట్టుబడులు పెడతామని, రాయితీలు కల్పించాలని కోరారు. అకిరా షిముజుతో జపాన్ పర్యటనలో ఉన్న చంద్రబాబు భేటీ అయిన సందర్భంగా ఆయన ఈ విధంగా స్పందించారు. భారత్ లో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని... గత పదేళ్లగా భారత్ పై జపాన్ కు ఉన్న అభిప్రాయాన్ని మార్చుకోవాలని ఈ సందర్భంగా అకిరాకు చంద్రబాబు సూచించారు. ఏపీలో జపనీస్ డెస్క్ పేరుతో ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని కూడా తెలిపారు.

  • Loading...

More Telugu News