: ఎస్టీలకు శుభవార్త... ఏపీలో ఏజెన్సీ డీఎస్సీ: గంటా
ఆంధ్రప్రదేశ్ లో గిరిజన నిరుద్యోగులకు శుభవార్త! గిరిజనులకు లాభించేలా ఏజెన్సీ డీఎస్సీని త్వరలోనే ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఏజెన్సీ డీఎస్సీ ద్వారా 2500 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే, డీఎస్సీ ద్వారా 9061 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించిన ఏపీ విద్యాశాఖ, అదనంగా మరో 2500 ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపింది. దీంతో, ఎస్టీలకు మరిన్ని ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయి.