: హైదరాబాదులో నేటి అర్థరాత్రి నుంచి ఆటోలు బంద్
నేటి అర్ధరాత్రి నుంచి హైదరాబాదులో ఆటోలు స్తంభించిపోనున్నాయి. ఉన్నత విద్య పూర్తిచేసిన వారే ఆటోలు నడపాలని మాలకొండయ్య కమిటీ ఇచ్చిన నివేదికను వ్యతిరేకిస్తూ, ఆటోడ్రైవర్లపై ఆర్టీఏ అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ రాజధానిలోని ఆటోడ్రైవర్ల సంఘాలు ఆటోల బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో, నేటి అర్ధరాత్రి నుంచి జంటనగరాల్లో ఆటో సర్వీసులు ప్రజలకు దూరం కానున్నాయి. తమ సమస్యలు సానుకూలంగా పరిష్కరించాలని ఆటోడ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ఆటో డ్రైవర్లలో చాలా మంది నిరక్షరాస్యులే ఉన్న కారణంగా, అర్హత నిబంధనను ఎత్తేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.