: ఉగ్రవాదులతో కొనసాగుతున్న పోరు... ముగ్గురు పౌరులు సహా ఏడుగురి మృతి
పాకిస్తాన్ సరిహద్దులోని పాడుబడ్డ బంకర్ లో దాగిఉన్న తీవ్రవాదులతో సైన్యం పోరు ఇంకా కొనసాగుతూనే వుంది. ఉదయం నుంచి జరుగుతున్న ఈ పోరులో ముగ్గురు ఉగ్రవాదులు, ఒక జవానుతో పాటు ముగ్గురు పౌరులు కూడా మృతి చెందారని డీఐజీ షకీల్ బేగ్ తెలిపారు. మొత్తం ఆరుగురు తీవ్రవాదులు పాక్ నుంచి వచ్చి చొరబడ్డారని ఆయన వివరించారు. సాయంత్రంలోగా తీవ్రవాదులను ఏరివేసే కార్యక్రమం పూర్తవుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. నేటి ఉదయం పాకిస్తాన్ సరిహద్దు దాటి భారత్ లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు ఆర్ ఎస్ పురా సమీపంలోని సైనిక బంకర్ లోకి వెళ్లి కాల్పులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అంతకుముందు, పాకిస్తాన్ సైన్యం తేలికపాటి మోర్టార్లతో కాల్పులు జరిపిందని, భారత సైన్యం దాన్ని తిప్పికొట్టే హడావుడిలో ఉండగా ఉగ్రవాదులు చొరబడ్డారని ఓ అధికారి తెలిపారు.