: సభా సంఘం సరిపోదు... రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ జరపండి: అక్బరుద్దీన్


హైదరాబాద్ లో సొసైటీలకు భూ కేటాయింపుల్లో చోటుచేసుకున్న అక్రమాలను నిగ్గు తేల్చేందుకు సభాసంఘం సరిపోదని, న్యాయ విచారణకు ఆదేశించాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. భూ కేటాయింపుల వ్యవహారానికి సంబంధించి ఎక్కడ వేలు పెట్టినా వందల కోట్ల రూపాయల అవినీతి వెలుగు చూడటం ఖాయమని ఆయన ఆరోపించారు. సభా సంఘం ఆధ్వర్యంలో జరిగే విచారణలో పూర్తి వాస్తవాలు వెలుగు చూసే అవకాశం లేదన్న ఆయన, రిటైర్డ్ న్యాయమూర్తితో న్యాయ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమాలను నిగ్గుతేల్చడంతో పాటు అక్రమార్కులపై చర్యలు కూడా సత్వరమే తీసుకునేలా చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

  • Loading...

More Telugu News