: తెలంగాణ నూతన పారిశ్రామిక విధానంపై ఉత్తర్వులు
తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానంపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అందులో, పారిశ్రామికవేత్తలకు ఆకట్టుకునే ప్రోత్సాహకాలను పొందుపరిచింది. ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఎస్సీలకు 15.4 శాతం, ఎస్టీలకు 9.3 శాతం, మహిళలకు 10 శాతం ప్లాట్స్ రిజర్వు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. చిన్న తరహా పరిశ్రమలకు భూమి కొనుగోలుపై చెల్లించిన స్టాంప్ డ్యూటీ, భూ బదలాయింపు డ్యూటీ వంద శాతం తిరిగి చెల్లించాలని నిర్ణయించింది. పారిశ్రామికవాడల్లో రూ.10 లక్షలకు పైగా వెచ్చించి భూములు కొన్నవారికి 25 శాతం రిబేట్ ఇస్తామని తెలిపింది. రూ.200 కోట్ల పెట్టుబడితో వెయ్యి మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలకు మెగా ప్రాజెక్టు హోదా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.