: 15 ఏళ్లకు మించి పాతబడిన వాహనాలు ఇక ఢిల్లీ రోడ్లపై కనిపించవు!
15 సంవత్సరాలకు మించి తిరుగుతున్న పెట్రోల్, డీజిల్ వాహనాలు ఇకపై దేశ రాజధాని ఢిల్లీ రోడ్లపై నడవకూడదని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్ జీటీ) ఆదేశాలు జారీ చేసింది. ఎన్ జీటీ చైర్ పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. దేశ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యం ప్రతిరోజు ప్రశ్నార్థకంగా, మరింత అధ్వానంగా మారిందని ఆదేశాల్లో పేర్కొంది. ఈ క్రమంలో చట్ట ప్రకారం సంబంధిత అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని, కాలం దాటిన వాహనాలను గుర్తించి సీజ్ చేసే విధంగా చూడాలని కోరింది.