: ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ను తొలగించండి: సుప్రీం
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీని ఐపీఎల్ నుంచి తొలగించాలని అత్యున్నత నాయస్థానం ఆదేశించింది. ఐపీఎల్ లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై విచారిస్తున్న సుప్రీంకోర్టు నేడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మొత్తం వివాదం అంతా చెన్నై ఫ్రాంచైజీ చుట్టూ తిరుగుతోందని అభిప్రాయపడ్డ కోర్టు, అసలు ఆ జట్టును తప్పించాలని ఐపీఎల్ నిర్వాహకులకు సూచించింది. ఈ సందర్భంగా కోర్టులో అడుగుతున్న ప్రశ్నలకు శ్రీనివాసన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.