: బుడ్గామ్ ఘటనలో తొమ్మిది మంది సైనికులపై కేసు నమోదు


బుడ్గామ్ కాల్పుల ఘటనలో ఇద్దరు పౌరుల మృతికి కారణమైన తొమ్మిది మంది సైనికులపై కేసులు నమోదయ్యాయి. దీంతో, వీరు కోర్టు మార్షల్ ను ఎదుర్కోనున్నారు. 53-రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన తొమ్మిది మంది సైనికులు అకారణంగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు యువకులు మరణించారు. ఈ కేసును ఎదుర్కొంటున్న తొమ్మిది మంది సైనికుల్లో ఓ జూనియర్ కమిషన్డ్ అధికారి కూడా ఉన్నారు. జమ్మూకాశ్మీర్ లో కారులో వెళుతున్న యువకులను అడ్డగించిన సైనికులు వారిపై కాల్పులకు దిగారు. ఈ నెల 3న ఈ ఘటన జరగగా, కాస్త ఆలస్యంగానైనా కేసు నమోదైంది.

  • Loading...

More Telugu News