: మోదీ విదేశాంగ విధానానికి ఒమర్ అబ్దుల్లా ప్రశంస
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రశంసించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఇతర దేశాలతో సంబంధాలు పెంపొందించుకుంటున్న విధానం, వ్యవహరిస్తున్న తీరు చాలా బాగుందని మెచ్చుకున్నారు. పొరుగు దేశాలకు వెంటవెంటనే వెళుతూ మంచి పని చేస్తున్నారని మీడియాతో అన్నారు. దేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు అమెరికా అధ్యక్షుడిని భారత్ రప్పిస్తుండడం ఆయన సాధించిన పెద్ద విజయమని ఒమర్ అభివర్ణించారు. అయితే, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ మోదీ నెరవేర్చాలని చెప్పారు.