: సీలేరు అడవుల్లో మావోయిస్టుల సభ
విశాఖ జిల్లా పరిధిలోని సీలేరు అడవుల్లో ముందు చెప్పినట్టుగానే మావోయిస్టులు అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఇటీవల మృతి చెందిన శరత్, గణపతిలకు నివాళులను అర్పించారు. పోలీసులు ప్రచారం చేసుకున్నట్టుగా వీరవరం దాడి ఘటనలో నాగేశ్వరరావు చనిపోలేదంటూ, అతడిని సభలో ప్రవేశపెట్టారు. ఈ సభలో పలువురు రాష్ట్ర కమిటీ నేతలు పాల్గొన్నట్టు తెలుస్తోంది.