: సార్క్ దేశాలతో మోదీ వేర్వేరు భేటీలు...ఒక్క పాకిస్థాన్ మినహా!
సార్క్ శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ సార్క్ కూటమిలోని అన్ని దేశాల అధినేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. అయితే పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో మాత్రం భేటీ కాలేదు. భేటీ కాదు కదా, ఆయనను తన సమీపంలోకి కూడా రానివ్వకపోవడం గమనార్హం. వేదిక పైకి నవాజ్ షరీఫ్ రావడానికి ముందే వేదిక మీద ఆసీనులైన ప్రధాని మోదీ, షరీఫ్ వస్తున్న విషయాన్ని గమనించనట్టే ఉండిపోయారు. చేతిలో వున్న పుస్తకాన్ని చదువుతున్నట్టు ఉండిపోయిన మోదీ, తన వెనుకే షరీఫ్ వెళుతున్నా, తనకేమీ పట్టనట్లు వ్యవహరించారు. ఇదిలా ఉంటే, సరిహద్దు వెంట భారత చెక్ పోస్టులపైకి పాక్ జరుపుతున్న కాల్పులకు తెరదించకపోతే చర్చల మాటే లేదని రక్షణ శాఖ సహాయ మంత్రి బుధవారం ప్రకటించారు. ఇందుకనుగుణంగానే మోదీ, నవాజ్ తో భేటీకి నిరాకరించారు.