: 5న విశాఖలో జగన్ మహా ధర్నా
విశాఖలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఈ నెల 5న మహాధర్నా చేపట్టనున్నారు. వైఎస్సార్సీపీ విశాఖ అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జగన్ మహాధర్నా చేపట్టనున్నారని అన్నారు. ఈ మహాధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మహాధర్నా పోస్టర్ను ఆవిష్కరించారు.