: గాంధీ ఆసుపత్రిలో ఒకే కాన్పులో నలుగురు పిల్లలు
హైదరాబాదు గాంధీ ఆసుపత్రిలో ఈ మధ్యాహ్నం ఓ మహిళ ఒకే కాన్పులో రెండు కవల జంటలకు జన్మనిచ్చింది. మెదక్ జిల్లా ఆరూర్ కు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలకు జన్మనిచ్చింది. ఒకే కాన్పులో కవలలు జన్మించడం సాధారణంగా జరుగుతుందని, అరుదైన సందర్భాల్లోనే ఇలాంటి జననాలు జరుగుతాయని వైద్యులు పేర్కొన్నారు. ఒకే కాన్పులో రెండు కవల జంటలు పుట్టాయని ఆసుపత్రి అంతా వింతగా చెప్పుకుంటున్నారు.