: నివాళులు, సంతాపాల కోసం ప్రత్యేక వెబ్ సైట్
ఆన్ లైన్ విస్తరిస్తోంది. సమాజంలోని ప్రతి అంశంపైనా వెబ్ సైట్లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా, ఈ లోకాన్ని వీడిన తమ వారికి ప్రజలు సంతాపాలు తెలిపేందుకు, నివాళులు అర్పించేందుకు శ్రద్ధాంజలి.కామ్ పేరిట ఓ వేదిక రూపుదిద్దుకుంది. విమల్ పొపట్, వివేక్ వ్యాస్ ఈ పోర్టల్ సృష్టికర్తలు. భారత్ లో ఈ తరహా వెబ్ సైట్ ఇదే ప్రథమం. తమవారి జ్ఞాపకాలను ఈ వెబ్ సైట్లో శాశ్వతంగా డిజిటల్ రూపంలో భద్రపరుచుకోవచ్చని వివేక్ వ్యాస్ తెలిపారు. మరణించిన వారికి చెందిన ఫొటోలు, వీడియోలు, ఈ పోర్టల్ వెబ్ పేజీలో ఉంచడం ద్వారా డిజిటల్ సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చట.