: పొన్నాలది దళితుల భూమి కాదు... ప్రభుత్వ భూమి: జానా రెడ్డి
పొన్నాల భూమి వ్యవహారం అసెంబ్లీలో వేడి పుట్టిస్తోంది. దళితులకు కేటాయించిన అసైన్డ్ భూమిని పొన్నాల తక్కువ ధరకు సొంతం చేసుకున్నారని హరీష్ రావు ఆరోపించారు. దీనిపై జానారెడ్డి మాట్లాడుతూ, పొన్నాల భూమి దళితులకు చెందినది కాదని... ఆ భూమిని గత ప్రభుత్వం ఏపీఐఐసీకి కేటాయించగా... అక్కడ నుంచి పొన్నాల ఆ భూమిని కొనుగోలు చేశారని చెప్పారు. ఈ భూమిని పొన్నాల నిరుపయోగంగా ఉంచకుండా, హ్యాచరీస్ పెట్టి పది మందికి ఉపాధి కల్పిస్తున్నారని తెలిపారు. కాబట్టి, దీనిపై చర్చ అనవసరమని చెప్పారు.