: కల్తీ మద్యానికి ఐదుగురు బలి... ఆరుగురు అధికారుల సస్పెన్షన్
రెండు రోజుల వ్యవధిలో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆరుగురు ఎక్సైజ్ అధికారులను సస్పెండ్ చేసింది. భాదోహి జిల్లాలో సాగుతున్న కల్తీ మద్యం విక్రయాలను పసిగట్టడంలో విఫలమయ్యారంటూ వీరిని విధుల నుంచి తప్పించినట్టు ఆ రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ అనిల్ కుమార్ గార్గ్ తెలిపారు. జిల్లాలోని అవురాయ్ ప్రాంతంలో ఓ మద్యం దుకాణంలో మద్యం కొని తాగిన వారిలో సోమవారం ముగ్గురు, మంగళవారం ఇద్దరు మరణించారని ఆయన తెలిపారు.