: ఓఎల్ఎక్స్ లో కారు అమ్మకానికి పెడితే చేదు అనుభవం ఎదురైంది!
ఉచితంగా ప్రకటనలు పొందుపరిచే సౌలభ్యం కల్పించిన వెబ్ సైట్ గా ఓఎల్ఎక్స్ విశేష ప్రాచుర్యం పొందింది. ఈ ఉచిత సౌకర్యాన్ని ఉపయోగించుకుని తన పాత కారును అమ్ముకుందామని భావించిన నెల్లూరు జిల్లా వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. గూడూరుకు చెందిన అశోక్ కుమార్ తన కారును అమ్ముతున్నట్టు ఓఎల్ఎక్స్ లో ప్రకటన ఇచ్చాడు. ఈ ప్రకటన చూసిన ఇద్దరు వ్యక్తులు అశోక్ కుమార్ ను సంప్రదించారు. కారు కొంటామన్నారు. టెస్ట్ డ్రైవింగ్ చేస్తామంటూ కారును ముందుకు ఉరికించారు. అశోక్ కుమార్ కూడా కారులోనే ఉన్నాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత వారు అశోక్ కుమార్ ను బయటికి నెట్టేసి, కారుతో పరారయ్యారు. దీనిపై ఆ వాహన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.