: కర్ణాటకలో గనులపై సుప్రీం ఉక్కుపాదం
ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర సరిహద్దులు నిర్ణయించే వరకూ గనుల తవ్వకం నిలిపివేయాలని ఓబుళాపురం మైనింగ్ కంపెనీని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ సంస్థకు చెందిన 7 గనుల లీజుపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. అలాగే కర్ణాటకలోని సి కేటగిరీకి చెందిన 49 సంస్థల గనుల లీజులను రద్దు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. రెండు రాష్ట్రాల సరిహద్దులను నిర్ణయించేందుకు భారత ప్రభుత్వ సర్వేయర్ జోక్యం చేసుకోవాలని కోరింది. సరిహద్దుల నిర్ధారణ పూర్తయిన తర్వాత నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు సాధికార కమిటీని ఆదేశించింది.