: చేతివాటం ప్రదర్శించిన ఫ్లిప్ కార్ట్ డెలివరీ బాయ్స్


గుర్గావ్ లో ఆన్ లైన్ అమ్మకాల పోర్టల్ ఫ్లిప్ కార్ట్ కు చెందిన ఇద్దరు డెలివరీ బాయ్స్ చేతివాటం ప్రదర్శించి కటకటాల వెనక్కిచేరారు. తమ కస్టమర్లకు ప్రొడక్ట్స్ అందలేదంటూ సౌరభ్ శేఖర్ అనే ఫ్లిప్ కార్ట్ ఉద్యోగి సెక్టార్ 18 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై, దర్యాప్తు సాగించిన పోలీసులు యోగేందర్, దీపక్ రాజ్ అనే డెలివరీ బాయ్ ల నిర్వాకాన్ని వెలుగులోకి తెచ్చారు. ఆర్డర్ బుక్ చేసిన కస్టమర్లకు ఇవ్వాల్సిన రెండు మొబైల్ ఫోన్లు, ఓ ఐపాడ్ ను వీరిద్దరూ నొక్కేసినట్టు పోలీసులు తెలిపారు. వారిని అరెస్ట్ చేసి, ప్రొడక్ట్స్ స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నాడు ఇద్దరినీ కోర్టులో హాజరుపరచగా, జ్యుడీషియల్ కస్టడీ విధించారు.

  • Loading...

More Telugu News