: ఫుట్ బాల్ హీరో మెస్సీ మాయాజాలం... బద్దలైన మరో రికార్డు
అర్జెంటీనా ఫుట్ బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. ఛాంపియన్స్ లీగ్ పోటీలలో రౌల్ పేరిట ఉన్న 71 గోల్స్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంతటి గొప్ప రికార్డుకు చేరుకోవడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని మెస్సీ వ్యాఖ్యానించాడు. అయితే, మ్యాచ్ లను గెలిపించే గోల్స్ చేసినప్పుడు మరింత ఆనందంగా ఉంటుందని ఆయన అన్నాడు. మంగళవారం రాత్రి అపోల్ నికోషియాపై మెస్సీ టీం తలపడగా, ఈ మ్యాచ్ లో తన అద్భుత మాయాజాలాన్ని ప్రదర్శిస్తూ, మెస్సీ మూడు గోల్స్ చేసి జట్టుకు విజయం సాధించి పెట్టాడు.