: బెంగళూరులో 'కిస్ ఆఫ్ లవ్'కు నో పర్మిషన్
బెంగళూరు నగరంలో బహిరంగ ముద్దులను అనుమతించమని నగర కమిషనర్ ఎమ్.ఎన్.రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 30న బెంగళూరులోని టౌన్ హాల్ వద్ద కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమాన్ని సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించుకోవడానికి అనుమతి మంజూరు చేయాలంటూ రచిత తనేజా అనే సామాజిక కార్యకర్త దరఖాస్తు చేశారు. దీనిపై స్పందించిన పోలీస్ కమిషనర్, బెంగళూరులో కిస్ ఆఫ్ అవ్ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో ఆశ్లీలత ఉట్టిపడే విధంగా ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం చట్టరీత్యా నేరమని ఆయన తెలిపారు.