: శ్రీరంగం ఆలయానికి బాంబు బెదిరింపు


తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగం పట్టణానికి సమీపంలో ఉన్న సుప్రసిద్ధ శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని బాంబులతో కూల్చివేస్తామంటూ వచ్చిన లేఖ కలకలం రేపుతోంది. ఈనెల 29లోగా రంగనాథ స్వామి ఆలయాన్ని కూల్చడమే లక్ష్యంగా భారీ విధ్వంసం సృష్టిస్తామని ఆగంతుకులు ఉత్తరం ద్వారా బెదిరింపులకు దిగారు. శ్రీరంగనాథ స్వామి వారి ఆలయంతో పాటు రైల్వే స్టేషన్, బస్సు స్టేషన్ పై బాంబులతో విరుచుకుపడతామని లేఖలో హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన తిరుచిరాపల్లి పోలీసులు ఆలయానికి భారీ బందోస్తు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రవేశానికి మూడు ద్వారాలు ఏర్పాటు చేశారు. 24 గంటలూ బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నారు. బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ పై కూడా నిఘా పెట్టారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, లేఖ ఎక్కడి నుంచి వచ్చింది, అనేది ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News