: మాదిగల్లో చీలిక... మంద కృష్ణ సమక్షంలోనే పోటాపోటీ నినాదాలు
ఎస్సీ వర్గీకరణ కోరుతున్న మాదిగల్లో చీలిక వచ్చినట్టు కనబడుతోంది. తిరుపతిలోని సీపీఐ కార్యాలయం వద్ద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. మంద కృష్ణ వర్గంగా కొందరు, దండు వీరయ్య వర్గంగా కొందరు విడిపోయారు. విడిపోయిన రెండు వర్గాల మధ్య నినాదాల యుద్ధం నడిచింది. ఈ చీలిక మంద కృష్ణ సమక్షంలోనే చోటుచేసుకోవడం విశేషం.