: నిరసనలతో అట్టుడుకుతున్న అమెరికా


అమెరికా ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఈ నెల 22న న్యూయార్క్ లో 12 ఏళ్ల తమీర్ రైస్ అనే బాలుడు ఓ గ్రౌండ్ బయట బొమ్మ తుపాకీతో ఆడుకుంటూ, సరదాగా గ్రౌండ్ లోని వారికి గురిపెట్టాడు. దానిని నిజమనుకుని ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి సమాచారమందించాడు. దీంతో, రంగ ప్రవేశం చేసిన పోలీసులు, అది నిజం తుపాకీయా? కాదా? అని తేల్చుకోకుండానే చేతులు పైకెత్తమని బాలుడిని హెచ్చరించారు. తన చేతిలో ఉన్నది బొమ్మ తుపాకీ కదా అని అతను నిర్లక్ష్యం చేయడంతో బాలుడిపై కాల్పులు జరిపారు. దీంతో తమీర్ విలవిల్లాడుతూ నేల కూలాడు. మరుసటి రోజు మృతి చెందాడు. దీనిపై నల్లజాతీయులంతా ఆగ్రహంతో ఊగిపోయారు. ఇంతలో ఆగస్టు 9న మైఖేల్ బ్రౌన్ అనే 18 ఏళ్ల నల్లజాతీయుడిని కాల్చి చంపిన ఘటనలో ఫెర్గ్యూసన్ పోలీస్ అధికారి డారెన్ విల్సన్ తప్పులేదని అమెరికన్ గ్రాండ్ జ్యూరీ నేడు తేల్చింది. దీంతో నిరసనలు పెల్లుబికాయి. లాస్ ఏంజిలెస్, ఫిలడెల్ఫియా, న్యూయార్క్, ఓక్ లాండ్, డెల్ వుడ్, కాలిఫోర్నియాల్లో ఆందోళనకారులు రెచ్చిపోయారు. వీధుల్లోకి వచ్చి పలు భవనాలకు నిప్పుపెట్టారు. పోలీస్ వాహనాలను ధ్వసం చేశారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు భాష్పవాయు ప్రయోగం చేశారు.

  • Loading...

More Telugu News