: ఓబులేశును తుపాకీ దాచిన ప్రాంతానికి తీసుకెళ్లిన పోలీసులు
అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిపిన ఓబులేశును పోలీసులు కర్నూలు తీసుకెళ్లారు. దాడి అనంతరం కర్నూలులో అతను బస చేసిన లాడ్జీల్లో సోదా చేశారు. కాగా, దాడిలో ఉపయోగించిన ఏకే-47 రైఫిల్ ను ఓర్వకల్లులో దాచానని చెప్పడంతో అక్కడికి తీసుకెళ్లారు. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.