: విషాదంగా మారిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమం
కడప జిల్లాలో 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. వేంపల్లి మండలంలోని ఇడుపులపాయలోని మారుతినగర్ ప్రాథమిక పాఠశాలలో 'స్వచ్ఛ భారత్' కార్యక్రమం చేపట్టారు. పాఠశాల ప్రాంగణం శుభ్రం చేస్తుండగా, పిచ్చిమొక్కల్లో దాక్కున్న పాము మూడవ తరగతి విద్యార్థిని కాటు వేసింది. దీంతో బాలుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినప్పటికీ ఒళ్లంతా విషం పాకడంతో మృతి చెందాడు. దీంతో గ్రామం, పాఠశాలలో విషాదం నెలకొంది.