: ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్
ఆంధ్రప్రదేశ్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ ను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డీఐజీ నేతృత్వంలో 463 మందితో టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాల్లో విపరీతంగా ఎర్రచంద్రనం అక్రమ రవాణా అవుతుండటం, పలువురిని అరెస్టు చేయడం జరుగుతూనే ఉంది. దాంతో, విసుగుచెందిన సర్కారు టాస్క్ ఫోర్స్ ను తీసుకొచ్చింది. మరోవైపు, నిన్న (సోమవారం) నాలుగువందలకు పైగా స్మగ్లర్లను తిరుపతి కోర్టు ముందు పోలీసులు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందిే.